కాసిపేట మండలంలోని లంబడి తండా గ్రామపంచాయతీలో, ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆదేశాలతో, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ గారి మార్గదర్శనంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శంకుస్థాపన ముగ్గు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు అజ్మీర తిరుపతి, కార్యదర్శి మానస, అజ్మీర రంజిత్, బానోత్ తిరుపతి, ఇస్లావత్ రాజు తదితరులు పాల్గొన్నారు.