కాసిపేట: క్రీడలు మానసిక ఉల్లాసానికి మార్గం

బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. కాసిపేట మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో జరిగిన మండల ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సీజన్-4 క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాసిపేట మండలానికి చెందిన యువకులు పది జట్లుగా విభజించి, సుమారు 200 మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. ఆటల ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, గెలుపోటములు సహజమని, ఓడిపోయినవారు నిరాశ చెందవద్దని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్