కాసిపేట మండలం దేవపూర్ రేంజ్ పరిధిలోని బీట్ ఆఫీసర్ లత 8 ఏళ్ల క్రితం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చుంచు జనార్ధన్ అనే వ్యక్తి గురువారం రాత్రి కొండాపూర్ యాపలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. తుంగ గూడకు చెందిన జనార్ధన్, 2018లో ప్లాట్ విషయంలో బీట్ ఆఫీసర్ లత తన వద్ద రెండున్నర లక్షలు తీసుకుందని, అడిగితే దూషిస్తుందని వాపోయాడు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు తెలిపారు.