రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ తెలిపారు. కాసిపేట మండలంలోని కోమటి చేనులో గురువారం ఆయన మాట్లాడారు. రైతులు గ్రామసభల్లో హాజరై తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు.