కాసిపేట: ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోండి

కాసిపేట మండలం ముత్యంపల్లి ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల అధ్యక్షుడు సంపత్ ఆధ్వర్యంలో పాఠశాలను పరిశీలించిన నాయకులు, వంటగది కూడా కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని, ఎమ్మెల్యే నూతన భవనాలకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్