కాసిపేట: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

కాసిపేట మండల పరిధిలోని కల్వరి చర్చి ఎదురుగా టేకు చెట్లలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసుల అరెస్టు చేసినట్టు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మందమర్రికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విందితుల నుంచి 140 గ్రాముల గంజాయి, ఒక బైకు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్