కాసిపేట: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఈ నెల 22వ తేదీ నుండి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తామని ఏఐటీయూసీ నాయకులు మల్లేష్, నరసయ్య హెచ్చరించారు. శనివారం కాసిపేట రెండవ గని వద్ద గేట్ మీటింగ్, ధర్నా కార్యక్రమం నిర్వహించి, కార్మికుల సమస్యలపై గని మేనేజర్ రమేష్ కు వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్