కాసిపేట: జోనల్ స్థాయి 5 కే రన్ ఎంపిక పోటీలు

కాసిపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల ఆవరణలో శనివారం జోనల్ స్థాయి 5కె రన్ బాల బాలికల ఎంపిక పోటీలు జరిగాయి. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 విభాగంలో నిర్వహించిన ఈ పోటీలను ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బాబురావు జండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 50 మంది హాజరుకాగా, ప్రతిభ చూపిన ఆరుగురిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్