నెన్నెల మండల కేంద్రంలో సర్పంచ్ స్థానానికి మాజీ ఎంపీపీ బొమ్మన శ్రీపతి దేవి అట్లహాసంగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని కృష్ణపల్లి రోడ్డు చౌరస్తా నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు డబ్బులతో నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.