జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నెన్నెల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.