నెన్నెల: పిచ్చికుక్క దాడిలో ఒకరికి గాయాలు

నెన్నెల మండలంలోని కోనంపేటలో పిచ్చికుక్క దాడిలో సునార్కరి సంతోష్ అనే యువకుడు గాయపడ్డాడు. భార్యతో కలిసి బైక్‌పై వస్తుండగా జరిగిన ఈ దాడిలో అతనికి నాలుగు చోట్ల గాయాలయ్యాయి. సంతోష్‌ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే కుక్క బోగంపల్లిలో రైతుకు చెందిన ఎడ్ల బండిపై దాడి చేసి ఎద్దును కూడా గాయపరిచింది. గ్రామంలో కుక్కల బెడద నివారించేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్