బెల్లంపల్లి మండలంలోని మాల గురజాల గ్రామంలో మంగళవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గం లలిత అనే మహిళ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రెండు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 30 బైకులు, నాలుగు ఆటోలను తనిఖీ చేసి జరిమానాలు విధించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై ప్రశాంత్ హెచ్చరించారు.