తాండూర్ కు పూర్వ ప్రాథమిక కేంద్రాలు మంజూరు చేయాలి.. బీఆర్ఎస్ నాయకులు

మంచిర్యాల జిల్లాలో 72 పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు మంజూరైనా, తాండూర్ మండలానికి ఒక్కటి కూడా కేటాయించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రయ్యకు వినతిపత్రం అందజేసి, తాండూర్ మండలంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలున్నాయని, పూర్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు చేస్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. వెంటనే తాండూర్ మండలానికి పూర్వ ప్రాథమిక కేంద్రాలు మంజూరు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్