కన్నెపల్లిలో సమ్మక్క–సారక్క బోనాల పండుగ ఘనంగా నిర్వహణ

కన్నెపల్లి మండల కేంద్రంలో సమ్మక్క–సారక్క బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రాలు ధరించి, బోనాలతో ఆలయానికి చేరుకుని గ్రామ దేవతలైన సమ్మక్క–సారక్కలకు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పండుగ సందర్భంగా మండల కేంద్రం భక్తుల రాకతో సందడిగా మారింది. డప్పుల చప్పుడు, సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం ఉట్టిపడింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్