కాసిపేట మండలంలోని సోమగూడెం, లంబాడి తండా (K), లంబాడి తండా (D) గ్రామాలలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రత్నం సుకుమారి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు గణనాధున్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.