ఖాది మేళాను సద్వినియోగం చేసుకోండి... బెల్లంపల్లి జిఎం

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సిఈఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఖాది మేళాను పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. వస్త్రాల కొనుగోలుపై 25% నుంచి 40% వరకు రాయితీ ఉందని, ఈనెల 29వ తేదీ వరకు మేళా ఉంటుందని వెల్లడించారు. 20 వేల వరకు వస్త్రాలు క్రెడిట్ పై అందించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్