తాండూర్: మాదారం పోలీస్ స్టేషన్ తనిఖీ

ప్రజలకు నమ్మకం కలిగించేలా విధులు నిర్వర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. తాండూర్ మండలంలోని మాదారం పోలీస్ స్టేషన్ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేసుల గురించి తాండూర్ సర్కిల్ సిఐ కుమార్ స్వామిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్