గురువారం తాండూరు మండలంలోని బోయపల్లి బోర్డు వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ దత్తు మూర్తి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, ఆర్ ఐ పద్మజా, డైరెక్టర్లు, కాసిపేట సర్పంచ్ ముదాం వనజ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తు మూర్తి మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు.