తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ గ్రామంలో నిద్రిస్తున్న మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తి రెండు తులాల బంగారు పుస్తెలతాడును దొంగిలించినట్లు ఎస్సై ప్రసాద్ రావు తెలిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి ఈ దొంగతనం జరిగినట్లు బాధితురాలు లక్ష్మి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.