తాండూరు: బీఆర్ఎస్ నేతలపై రాజకీయ కక్షసాధింపు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని పక్కదారి పట్టించేందుకు సిట్ పేరుతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం తాండూరు ఐబీలో బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దొంగహామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్