సోమవారం రాత్రి తాండూరు మండలంలోని కిష్టంపేట గ్రామంలో కామ దహనం చేస్తుండగా ఉండి మల్లేష్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మంటల్లో పడి గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.