వేమనపల్లి మండల కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడి రమేష్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయానికి కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేశారు.