మందమర్రి ఏరియాలో 100% బొగ్గు ఉత్పత్తి

మందమర్రి ఏరియాలో గడిచిన ఏప్రిల్ నెలలో 100% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు. గురువారం మందమర్రి ఏరియా జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. రెండు లక్షల 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకోగా, 100% ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులతో కలిసి కృషి చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్