మందమర్రిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చిన నిరసనల్లో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ నిలిచిపోగా, విద్యాసంస్థలు, వ్యాపారాలు స్వచ్ఛందంగా మూసివేశారు. మంత్రి వివేక్, బీసీ కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసనల్లో పాల్గొని, కేంద్రం తీరుపై, బీజేపీ నాయకుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్రం వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.