చెన్నూరు పోలీస్ స్టేషన్ ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ల పనితీరును గమనించి, సిబ్బందికి సూచనలు, సలహాలు అందించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా నిషేధించాలని ఆయన కోరారు.