భీమారం మండల కేంద్రంలోని ముదిరాజ్ కాలనీలో ఉన్న పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం సంఘం పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు రెండు తులాల బంగారు ఆభరణాలు, 4.5 కిలోల వెండి ఆభరణాలు, 35 వేల నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.