చెన్నూరు: కోర్టు ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటిన జడ్జి

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో జడ్జి పర్వతనేని రవి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. జడ్జి మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా అవి పెరిగి, ఎంతో మందికి నీడనిస్తున్నాయని తెలిపారు. మానవ మనుడగడకు, మానవాళికి చెట్లు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వన మహోత్సవంలో భాగస్వాములు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్