రాష్ట్ర మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు శాఖలు కేటాయించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలతో పాటు గనులు, జియాలజీ శాఖలకు కేటాయించారు. గతంలో చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సోదరుడు వినోద్ కూడా కార్మిక శాఖ మంత్రిగా పనిచేయడం గమనార్హం.