నాగపూర్ గ్రామ ప్రజలకు రోడ్డు నిర్మాణానికి చేయాత

చెన్నూర్ మండలంలోని నాగపూర్ గ్రామ రైతులకు రోడ్డు నిర్మాణానికి బీజేపీ నియోజకవర్గ నాయకులు దుర్గం అశోక్ చేయూతనందించారు. గ్రామంలోని రైతులందరికీ గోదావరి రోడ్డు నుంచి గ్రామం వరకు ఒకే దారి ఉంది. ఆ రోడ్డు వర్షాకాలంలో బురదమయంగా మారుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి గ్రామములోని రైతులందరూ కలిసి నిధులను సమీకరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆయన కొంత నగదును అందించారు.

సంబంధిత పోస్ట్