కోవిడ్ విపత్కర సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడిన మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని సీటీయూ (CTU) కార్మిక సంఘం డిమాండ్ చేసింది. మందమర్రి మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీటీయూ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంకె రవి, ప్రధాన కార్యదర్శి దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యోగ భద్రతను ప్రభుత్వాలు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగబద్ధమైన ఉద్యోగ భద్రతను వెంటనే కల్పించాలని వారు కోరారు.