మట్టి వినాయకుడితో పర్యావరణ పరిరక్షణ..మందమర్రిలో వినూత్న వేడుకలు

మందమర్రి మార్కెట్ ప్రాంతంలోని శ్రీవర సిద్ధి వినాయక మండలి వ్యాపారస్తుల సంఘం, వినాయక చవితి వేడుకల్లో ఆర్భాటాలకు స్వస్తి పలికి, ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా స్వచ్ఛమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పూజల అనంతరం అక్కడికక్కడే నిమజ్జనం చేసి ఆదర్శంగా నిలిచింది. వరుసగా రెండో సంవత్సరం ఈ పర్యావరణహిత వేడుకలను నిర్వహించారు. రసాయన రహిత మట్టి విగ్రహంతో భక్తులకు పచ్చదనం, పరిశుభ్రతపై సందేశం ఇచ్చారు. నీటి వనరులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే మట్టిని కలిపి నిమజ్జనం పూర్తి చేశారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎస్సై గోపతి నరేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పాల్గొన్నారు. ఈ ప్రకృతి హిత వేడుకలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕