మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లోని మందమర్రి పట్టణంలో ఆదివారం, జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో కేంద్రాన్ని కాంగ్రెస్ యువ నాయకులు జావిద్ ఖాన్, వేముల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.