చెన్నూర్‌లో తపస్ (TAPAS) మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు మోకెనపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయుల న్యాయమైన ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా, వారికి మధ్యాహ్న భోజనం, బ్రేక్‌ఫాస్ట్ పెడతామంటూ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ వింత వాదనకు నిదర్శనమని అన్నారు. 36 నెలలుగా పిఆర్సి (PRC) అందలేదని, ఆరు డిఏలు పెండింగ్‌లో ఉన్నాయని, తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.