జైపూర్: ప్రభుత్వ ఆసుపత్రి పట్ల నమ్మకం కలిగించారు

ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందుతుందని ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్య సిబ్బంది విధులు నిర్వర్తించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఇతర రికార్డులను ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్