క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఆదివారం కాకా గడ్డం వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. టిపిసిసి మాజీ కార్యదర్శి పి రఘునాథరెడ్డి మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రిగా కాకా వెంకటస్వామి సింగరేణిని కష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చిన సేవలు మరువలేనివని కొనియాడారు.