కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. సిర్స గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు వేసిన పంటలు ఎన్ని ఎకరాలలో నీట మునిగాయనే విషయమై అధికారులను నివేదిక కోరారు. రైతులు వేసిన పంట ఎంత మేర నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ రైతులకు తెలిపారు.