కోటపల్లి: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కోటపల్లి మండలంలో ఆదివారం పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ వెంకటేశ్వర్లు తెలిపారు కిష్టంపేట నుంచి చెన్నూరుకు వెళ్లే 33 కెవి లైన్ మరమ్మతుల కారణంగా కోటపల్లి, ఆలుగామ, దేవరవాడ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్