క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో శనివారం బీసీ బంధు విజయవంతంగా జరిగింది. శ్రీనివాస గార్డెన్ నుంచి క్యాతనపల్లి క్రాస్ రోడ్డు వరకు, అమ్మ గార్డెన్, గద్దెరాగడి ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి దుకాణాన్ని సందర్శించి, బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా బంధును పాటించాలని కోరారు. ఈ బంధులో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.