తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు బిక్షాటన చేశారు. ఈ నిరసన బుధవారం మూడో రోజుకు చేరుకుంది. కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం తక్షణమే సెక్యూరిటీ గార్డులను విధుల్లోకి తీసుకుని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.