మందమర్రి: రైల్వే ట్రాక్ పై యువకుడి మృతదేహం లభ్యం

మందమర్రి, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మందమర్రి రామన్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 30-35 ఏళ్ల వయసున్న మృతుడు, వైట్ గీతల షర్టు, గ్రే కలర్ జీన్స్ ధరించి ఉన్నాడు. అతని ఎడమ చేతిపై త్రిశూలం, మణికట్టు వద్ద 'RAG IAM' పచ్చబొట్టు, మెడలో ఆంజనేయస్వామి బిల్లతో కూడిన నల్లని దారం, ఎడమ చెవికి పోగు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేదా వస్తువులు లభించలేదని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు.

సంబంధిత పోస్ట్