మందమర్రి ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలను గురువారం జీయం రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ నెల 13 నుంచి 19 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుత పోటీ మార్కెట్లో సింగరేణి బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.