జల్ భగీరథి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని సోషల్ మీడియాలో వచ్చిన తప్పుడు ప్రచారాలపై స్పందిస్తూ, మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో నీటి కుంటలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం మంచిర్యాల జిల్లాలో చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని ఆయన తెలిపారు.