సింగరేణిలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు గైర్హాజరు పేరిట ఉద్యోగాలను కోల్పోయి నష్టపోవద్దని కేకే5 గని ఇన్‌చార్జి మేనేజర్ రమేష్ అన్నారు. బుధవారం మందమర్రి ఏరియాలోని కేకే5 గనిలో కొన్ని నెలలుగా విధులకు గైర్హాజరవుతున్న కార్మికులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఉపరితలంలో పనిచేసే కార్మికులు నెలకు 20, భూగర్భంలో పనిచేసేవారు 16 రోజులు తప్పనిసరిగా చేయాలని సూచించారు.