మందమర్రి అందుగులపేటలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఇన్‌చార్జ్ కడారి జీవన్ కుమార్ కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6.61 లక్షల కార్డులు ఇవ్వబోతుందన్నారు.