మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 35 మంది వాహనదారులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించి, రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. క్షణికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలకు తెగించవద్దని సూచించారు.