మందమర్రి: ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, సింగరేణి ఉద్యోగులు తమ పని గంటలను సద్వినియోగం చేసుకొని సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. శనివారం జిఎం కార్యాలయంలో జరిగిన ఉత్పత్తి, సంక్షేమ కార్యక్రమాల సమీక్షలో ఆయన మాట్లాడుతూ, భూగర్భ గనుల్లో సిబ్బంది గైర్హాజరు వల్ల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో ఏరియాలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను ఆయన సమగ్రంగా వివరించారు.

సంబంధిత పోస్ట్