మందమర్రి: 350 ఎచ్.పీ సబ్ మెర్సిబుల్ పంపును ప్రారంభించిన జీఎం

మందమర్రి ఏరియాలోని కేకే 1 గని వద్ద బుధవారం 350 ఎచ్.పీ సబ్ మెర్సిబుల్ పంపును ఏరియా జీఎం జి. దేవేందర్ ప్రారంభించారు. కొన్ని కారణాలతో కేకే–5 గని నుండి వచ్చే నీటి సరఫరా కొంతకాలం నిలుపుదల చేస్తున్నట్లు జీఎం పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా కేకే–1 గని నీటిని బోర్ వెల్ ద్వారా పైకి తీసుకువచ్చి శుభ్రం చేసి కాలనీలకు నీటి సరఫరా మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్