మందమర్రి పట్టణం సాయిబాబా టెంపుల్ లో గురువారం పవిత్ర గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం సుప్రభాత సేవా కార్యక్రమం, బాబాకి పంచామృతాభిషేకం, మంగళ హారతి నీరాజనం అనంతరం మధ్యాహ్నం గురు పాదుకపూజ అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సాయంత్రం 8 గంటల వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.