సిపిఐ పార్టీ తన శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 26న ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ ఉత్సవాలు ఈనెల 15 నుంచి జూడేఘాట్ వద్ద ప్రారంభమవుతాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. మందమర్రిలో గురువారం ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.