మందమర్రిలోని పురాతన హరిహర దేవాలయాన్ని జనరల్ మేనేజర్ రాధాకృష్ణ సోమవారం సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని జీఎం రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.